ఖమ్మం నగరానికి గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నేరవేర్చలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. నగరానికి ఐదువేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి, కనీసం యాభై కూడా ఇంతవరకు ప్రారంభించలేదని అన్నారు.
'ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదు' - ఖమ్మం జిల్లా వార్తలు
గత ఆరేళ్లలో ఖమ్మం నగరానికి మంత్రులు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదని సీపీఎం జిల్లా జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పలు కార్యక్రమాలు ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదని అన్నారు.
'ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదు'
గొల్లపాడు ఛానల్ అంతే ఉందని, శంకుస్థాపన చేసిన ఖమ్మం బస్టాండ్, నగర పాలక సంస్థ కార్యాలయం, నగరంలోని అనేక రహదారులు ప్రారంభానికి కూడా నోచుకోలేదని జిల్లా నాయకులు ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి :చికెన్, గుడ్లతో ఆరోగ్యం.. అందరూ తినండి: మంత్రి కేటీఆర్