నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రజలు తరలొస్తున్నారు. ఖమ్మంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద క్రయవిక్రేతల సందడి నెలకొంది.
రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం - రిజిస్ట్రేషన్ల వార్తలు
పాత పద్ధతిలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించటంతో ఖమ్మంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద క్రయవిక్రేతల సందడి నెలకొంది. అనుమతి పొందిన వాటికే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నెలకొన్న సందడి
పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నప్పటికీ ఎల్‌ఆర్‌ఎస్, లేఆవుట్ అనుమతులు పొందిన భూములు, నివాసాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిగా కార్యాలయానికి రావాలని కోరారు.
ఇదీ చదవండి:నడిరోడ్డుపై దారుణం- యువతిపై కత్తితో దాడి