తెలంగాణ

telangana

ETV Bharat / state

పుట్టగానే ఊపిరి కోసం పాప ఉక్కిరిబిక్కిరి - తెలంగాణ వార్తలు

పాపనో.. బాబో.. పుట్టాడంటే కన్నవారి ఆనందానికి అవధులు ఉండవు. తమ కలల పంటను చూసి మురిసిపోని దంపతులంటూ ఉండరు. అయితే, పుట్టుకతోనే ఆ బిడ్డ శ్వాస తీసుకోవడానికి తల్లడిల్లుతుంటే.. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. అలాంటి హృదయవిదారక సన్నివేశమే ఇది.

 Newly born baby Breathing trouble in Khammam district
Newly born baby Breathing trouble in Khammam district

By

Published : May 31, 2021, 9:09 AM IST

పుట్టుకతోనే బిడ్డ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే.. కన్న వాళ్లు తల్లడిల్లి పోయిన సంఘటన ఇది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన సలీమ ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టుకతోనే ఆ శిశువుకు శ్వాస సమస్య ఏర్పడింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఆ నవజాత శిశువును ఆదివారం వైద్య పరీక్షల కోసం ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న అంబులెన్సులో అదే నగరంలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అంబులెన్సు దిగిన తరవాత.. సలీమ కుటుంబసభ్యులు ఆ శిశువును ఇలా ఆక్సిజన్‌ సిలిండర్‌తో సహా ఆసుపత్రిలోపలికి పట్టుకెళ్లడం చూపరుల మనసులనూ కదిలించింది.

ABOUT THE AUTHOR

...view details