ఖమ్మం నగరంలో ఇటీవల ఓ కామాంధుని పైశాచికానికి బలైన బాలిక ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. నిరుపేదలైన బాలిక తల్లిదండ్రులు ఇల్లు కట్టుకోవాలనే కోరికతో అదే గ్రామానికి చెందిన పేరం రాములు వద్ద రూ. 2 లక్షలు అప్పు చేశారు. అది తీర్చలేకపోవడంతో రాములు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. వారికి తీర్చే స్థోమత లేదని తెలియడంతో అతడో బేరం పెట్టాడు. వారి 13 ఏళ్ల కుమార్తెను తనకు అప్పగిస్తే ఒకరింట్లో పనికి కుదిర్చి కొంత సొమ్ము రాబడతానని నమ్మబలికాడు. అలా ఆ చిన్నారిని ఖమ్మం నగరంలోని అల్లం సుబ్బారావు ఇంట్లో పనికి కుదిర్చి ఆయన నుంచి రూ. 50,000 తీసుకొని తన అప్పులో జమ చేసుకున్నాడు.
ఖమ్మంలో బాలికపై హత్యాచార ఘటనలో కొత్త కోణం - new update in a rape case in khammam
ఖమ్మం నగరంలో ఇటీవల ఓ కామాంధుని పైశాచికానికి బలైన బాలిక ఉదంతంలో కొత్తకోణం వెలుగుజూసింది. ఆమె తల్లిదండ్రులు పేదరికంతో చేసిన అప్పే ఈ ఘోరానికి కారణమైందని తేలింది. పల్లెల్లో ఒకప్పుడు క్రూరంగా రాజ్యమేలిన ‘వెట్టి’ చాకిరీకి కొత్తకోణంలా నిలుస్తోంది.
నాటి వెట్టికి.. నేటి సాక్ష్యం
సుబ్బారావు కొడుకు మారయ్య ఆ బాలికపై కన్నేసి గతనెల 18న అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె లొంగకపోవడంతో పెట్రోలు పోసి నిప్పంటించగా తీవ్రంగా గాయపడి మరణించిన విషయం తెలిసిందే. రాములు చేసిన పనే తమ కుమార్తె మృతికి కారణమైందంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను పనిలో పెట్టుకుని గుత్తగా డబ్బు ఇచ్చిన సుబ్బారావు పైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.