ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపు బైపాస్ ప్రాంతంలో నూతన బస్టాండు మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి సేవల్ని అందించబోతోంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రయాణ ప్రాంగణాల తర్వాత ఆధునిక బస్టాండుగా రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త బస్టాండు ప్రయాణికులకు విశేషమైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఎంజీబీఎస్, జేబీఎస్ లో మొత్తం 60 ప్లాట్ ఫాం లు ఉండగా..ఖమ్మం ప్రయాణ ప్రాంగణం 30 ప్లాట్ ఫాంలతో కొలువుదీరింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులన్నీ కొత్త ప్రయాణ ప్రాంగణం నుంచే రాకపోకలు సాగించేలా...ఒకేసారి 60 బస్సులు కొలువుదీరేలా కొత్త బస్టాండ్ నిర్మితమవుతోంది.
సకల సౌకర్యాలు
ఎక్కువ బస్సులు రాకపోకలు సాగించడంతోపాటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా కొత్త ప్రయాణ ప్రాంగణం నిర్మాణం చేపడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు, రాజమండ్రి, విజయవాడ, విశాఖ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని బస్సులు రానున్న రోజుల్లో కొత్త బస్టాండ్ నుంచే రాకపోకలు సాగించనున్నాయి. ఇందుకోసం బస్టాండ్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏయే బస్సులు ఎక్కడ ఆగుతాయి.