తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆస్తులపై ఉన్న శ్రద్ధ... ప్రజల హక్కులపై లేదు' - raithu poru garjana at khammam

ఖమ్మం జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై రైతు పోరు గర్జన నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఆచార్య కోదండరామ్ హాజరయ్యారు.

New democrasi conducted raithu poru garjana
ఖమ్మంలో రైతు పోరు గర్జన

By

Published : Nov 27, 2019, 11:51 PM IST

పాలకులకు తమ ఆస్తులపై ఉన్న శ్రద్ధ ప్రజల హక్కులపై లేకపోవటం వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై రైతు పోరు గర్జన నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పెవిలియన్ మైదానం వరుకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టి కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అనుమతి రాకుంటే కార్మికుల కోసం తెలంగాణ సమాజం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్మికులు ఉద్యమంలో విఫలమయితే ప్రజలు తమ హక్కులను కోల్పోతారని న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగారావు అన్నారు.

ఖమ్మంలో రైతు పోరు గర్జన

ABOUT THE AUTHOR

...view details