భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ముకుందాపురం, లచ్చగూడెం, ధర్మాపురం, పోలారం, మర్రిగూడెం, బొజ్జాయిగూడెం గ్రామాల్లో న్యూడెమోక్రసీ(ఎంఎల్) ఆధ్వర్యంలో ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకస్తూ.. నిరసన కార్యక్రమం చేపట్టారు. భౌతిక దూరం పాటిస్తూ. నిరాడంబరంగా మేడే వేడుకలు జరుపుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రేషన్ కార్డు లేని వారికి సైతం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుబంధు డబ్బును వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు.