ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను 70 శాతం పూర్తయ్యాయని ఒకవైపు అధికారులు చెబుతుండగా.. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి తలపెట్టిన రోళ్లపాడు రిజర్వాయర్ పనులను ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదని న్యూడెమోక్రసీ నాయుకులు మాజీ జడ్పీటీసీ గౌని ఐలయ్య ప్రశ్నించారు. ప్రభుత్వం రీడిజైన్ పేరిట భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలను బీడు భూములుగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
'రోళ్లపాడు రిజర్వాయర్ పనులను ఎందుకు మొదలుపెట్టలేదు..?' - ఖమ్మం జిల్లా తాజా వార్త
ఖమ్మం జిల్లాలోని రోళ్లపాడు రిజర్వాయర్ పనులను ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదని న్యూడెమోక్రసీ నాయకులు ప్రశ్నించారు. అఖిలపక్షాల పిలుపుమేరకు రిజర్వాయర్ సందర్శనుకు వెళ్లిన నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని న్యూడెమోక్రసీ నాయకులు గౌని ఐలయ్య తప్పుబట్టారు.

'రోళ్లపాడు రిజర్వాయర్ పనులను ఎందుకు మొదలుపెట్టలేదు..?'
మహబూబాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. మొదట చేసిన వాగ్ధానం ప్రకారం రోళ్లపాడు వద్ద రిజర్వాయర్ పనులను వెంటనే మొదలు పెట్టాలని ఆయన కోరారు. ప్రజల ఆకాంక్ష మేరకు పోరాటాలు చేస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు.. అరెస్ట్ చేసిన న్యూడెమోక్రసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి
TAGGED:
ఖమ్మం జిల్లా తాజా వార్త