తోటికోడళ్లు మృతి... ఆ తండాలో విషాదం - nephews died in khammam district
అనారోగ్యంతో మృతి చెందిన అక్కని చూడటానికి వచ్చిన తోటి కోడలు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
khammam district latest news
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం గంగబండ తండాలో సోనా అనే 54 సంవత్సరాల మహిళ అనారోగ్యంతో తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె తోటి కోడలు చక్రి (46)... అక్కని చూడగానే ఒక్కసారిగా కింద పడిపోయింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. తోటికోడళ్ల మధ్య ఉన్న ప్రేమే దీనికి కారణమని గ్రామస్థులు చెప్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవటం వల్ల తండాలో విషాదం అలుముకుంది.