తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం.. మంత్రి అజయ్ ఆగ్రహం

పల్లె ప్రగతిలో నిర్లక్ష్యంపై మంత్రి అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతల నిర్మాణం తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

By

Published : Jun 7, 2020, 4:31 PM IST

Updated : Jun 7, 2020, 6:36 PM IST

పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం.. మంత్రి అజయ్ ఆగ్రహం
పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం.. మంత్రి అజయ్ ఆగ్రహం

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పర్యటించారు. అనంతరం పల్లె ప్రగతి పనులను మంత్రి పరిశీలించారు. గ్రామంలో వీధుల వెంట తిరుగుతూ పనులను తనిఖీ చేశారు. గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం సరిగా లేకపోవడం చూసిన మంత్రి సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్ తీగలు వెంటనే సరిచేయండి !

మురుగు కాలువల నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ గ్రామస్తుడు తన ఇంటి పైనుంచి కరెంటు వైర్లు వెళ్తున్నాయని చెప్పగా... స్వయంగా అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించారు. విద్యుత్ తీగలను సరిచేయాల్సిందిగా ఎస్ఈ రమేశ్​ను ఆదేశించారు. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించాలని సంబంధిత అధికారులరు ఆదేశాలను జారీ చేశారు. మంత్రి వెంట కలెక్టర్ ఆర్​వీ కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత, డీపీఓ శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు.

పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం.. మంత్రి అజయ్ ఆగ్రహం

ఇవీ చూడండి : షేక్​పేట్​ ఘటనపై అనిశా విచారణ

Last Updated : Jun 7, 2020, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details