ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చిన్న మండవ వద్ద మున్నేరు వరద నీటిలో చిక్కుకుపోయిన వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా రక్షించింది. ప్రాణాపాయం తప్పడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మున్నేరు వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
ఖమ్మం జిల్లా మున్నేరు వాగులో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వైరా ఏసీపీ సత్యనారాయణ సూచనల మేరకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం బాధితుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మున్నేరు వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
చేపల వేటకు వెళ్లిన పరచగాని బుల్లి వెంకయ్య మున్నేరులో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న వైరా ఏసీపీ సత్యనారాయణ, తహసీల్దార్ తిరుమలా చారి సూచనలతో ఎన్టీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. వరద నీటిలో చిక్కుకున్న వెంకయ్యను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఫలింతగా గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.
TAGGED:
ఖమ్మం జిల్లా తాజా వార్తలు