విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను విడుదల చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కల్యాణపు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఏన్కూరులో నిర్వహించిన జాతీయ పింఛనుదారుల దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వం మంజూరు చేసే ఆరోగ్యకార్డులు చాలా వరకు ఉపయోగ పడటం లేదని, అన్నీ ఆసుపత్రుల్లో అనుమతించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విశ్రాంత ఉద్యోగులకు అవసరమైన వసతులు కల్పించాలని కోరారు. సీనియర్ పింఛనుదారులకు ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానం చేశారు. ఎంపీపీ అరెం వరలక్ష్మి, జడ్పీటీసీ బాదావత్ బుజ్జి, నిర్వహకులు తోట రామచంద్రయ్య పాల్గొన్నారు.
'పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను విడుదల చేయాలి' - pentioners day
ఖమ్మం జిల్లా ఏన్కూరులో జాతీయ పింఛనుదారుల దినోత్సవం నిర్వహించారు. విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను విడుదల చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కల్యాణపు కృష్ణయ్య డిమాండ్ చేశారు.
'పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను విడుదల చేయాలి'
TAGGED:
pentioners day