తెలంగాణ

telangana

ETV Bharat / state

'గోళ్లపాడు నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం' - bc corporation news

ఖమ్మం నగరం గోళ్లపాడు ఛానల్​ ప్రాంతంలో జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు తల్లోజు ఆచారి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెసుకున్నారు. నివాసాలు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

NATIONAL BC CORPORATION MEMBER VISITED GOLLAPADU
NATIONAL BC CORPORATION MEMBER VISITED GOLLAPADU

By

Published : Aug 13, 2020, 4:01 AM IST

గోళ్లపాడు ఛానల్​ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి భరోసా ఇచ్చారు. ఖమ్మం మూడో పట్టణ ప్రాంతంలో పర్యటించిన ఆచారి... కాల్వకట్టపై నివాసం ఉంటున్న వారిని కలిశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతానని హామీ ఇచ్చారు.

గోల్లపాడు ఛానల్‌పై దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 600 ఇళ్లు తొలగించేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారని బాధితులు తెలిపారు. తమ తహాతకు మించి ఖర్చు పెట్టి నివాసాలు కట్టుకున్నామని... ఇప్పుడు వాటిని తొలగించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పడకల ఇళ్లు కానీ, వెలుగుమట్ల రెవెన్యూ పంచాయతీ పరిధిలో గతంలో ఇచ్చిన పట్టాలకు భూములు చూపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details