ఖమ్మం నగరంలోని గోళ్లపాడు ఛానల్ నిర్వాసితులకు వెలుగుమట్ల రెవెన్యూ పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా జాతీయ బీసీ కమిషన్ కృషి చేసిందని కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి తెలిపారు. ఈ మేరుకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించారు.
'గోళ్లపాడు ఛానెల్ నిర్వాసితులకు న్యాయం చేసేందుకు కృషి' - గోళ్లపాడు ఛానెల్ తాజా సమాచారం
గోళ్లపాడు ఛానెల్ నిర్వాసితులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేలా జాతీయ బీసీ కమిషన్ కృషి చేసిందని కమీషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పేర్కొన్నారు. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో సర్కారు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించారు.
'గోళ్లపాడు ఛానెల్ నిర్వాసితులకు న్యాయం కోసం బీసీ కమిషన్ కృషి'
వెలుగుమట్లలో పర్యటన సందర్భంగా స్థానికులతో మాట్లాడిన తల్లోజు ఆచారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు అధికారులతో మాట్లాడి.. వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్వరలోనే విద్యుత్, రహదారులు, నీటి ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీఓ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'థామస్రెడ్డిపై కార్మికచట్టం ప్రకారం చర్యలు తప్పవు'