ఖమ్మం నగరంలో నందమూరి యువసేన ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి... ఆర్థికంగా చతికిలపడ్డ సినిమా థీయేటర్ల కార్మికులకు నిత్యావసర సరకులు అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీమంతుడు ఫేం నటి సౌమ్యజాను, యజ్ఞం చిత్ర దర్శకుడు ఏఎస్. రవికుమార్ చౌదరి పాల్గొన్నారు.
కార్మికులకు నందమూరి యువసేన చేయూత - ఖమ్మంలోని సినిమా థీయేటర్లలో పనిచేస్తున్న కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ
ఖమ్మం నగరంలోని సినిమా థీయేటర్లలో పనిచేస్తున్న కార్మికులకు నందమూరి యువసేన ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు. లాక్‌డౌన్‌తో చతికిలపడ్డ కార్మికులకు చేయూత ఇవ్వాలనే ఉద్ధేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
నందమూరి యువసేన ఆధ్వర్యంలో కార్మికులకు చేయూత