ప్రముఖ నటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలను.. ఖమ్మంలో అభిమానులు వైభవంగా నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా తెతెదేపా జిల్లా కార్యాలయంలో పార్లమెంటరీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు కేక్‌కట్ చేశారు.
'నటనలో తండ్రికి తగ్గ తనయుడు బాలకృష్ణ' - Balakrishna Birthday Celebrations in Khammam
నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా బాలకృష్ణ రాణిస్తున్నారని ఖమ్మం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు అన్నారు. తెతెదేపా జిల్లా కార్యాలయంలో కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
'నటనలో తండ్రికి తగ్గ తనయుడు బాలకృష్ణ'
నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారని వెంకటేశ్వర్లు తెలిపారు. రాజకీయ రంగంలో సైతం ఎనలేని సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో వైవిధ్యభరితమైన చిత్రాలు తీసి అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు.
ఇదీ చూడండి:దేశంలో మరో 9,985 కేసులు, 279 మరణాలు