తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్లమెంట్​ కమిటీ సమావేశాల్లో ఎంపీ నామ బిజీ - kammam latest news

పార్లమెంట్​ కమిటీ సమావేశాలతో ఖమ్మం ఎంపీ, తెలంగాణ లోక్​సభ పక్షనేత నామ నాగేశ్వర రావు బిజీగా మారారు. సెప్టెంబర్​ 15 నుంచి అక్టోబర్​ 1 వరకు జరగనున్న వర్షాకాల పార్లమెంట్​ సమావేశాలకు ముందస్తుగా కమిటీ భేటీలు జరుగుతున్నాయి.

పార్లమెంట్​ కమిటీ సమావేశాల్లో ఎంపీ నామ బిజీ
పార్లమెంట్​ కమిటీ సమావేశాల్లో ఎంపీ నామ బిజీ

By

Published : Aug 28, 2020, 8:06 PM IST

సెప్టెంబర్​ 15 నుంచి అక్టోబర్​ 1 వరకు జరగనున్న వర్షాకాల పార్లమెంట్​ సమావేశాలకు సంబంధించి ముందస్తుగా జరుగుతున్న పార్లమెంట్​ కమిటీ భేటీల్లో ఖమ్మం ఎంపీ, తెలంగాణ లోక్​సభ పక్షనేత నామ నాగేశ్వర రావు పాల్గొన్నారు.

అక్టోబర్​ 1 వరకు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్​ వ్యవహారాల కేబినెట్​ కమిటీ ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్​కు సంబంధించి గ్రంథాలయ కమిటీ, కామర్స్​, బిజినెస్​ అడ్వజరీ, స్టాండింగ్​, జలశక్తి కమిటీల్లో నామ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి.

ఇవీ చూడండి: రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది: తెలంగాణ

ABOUT THE AUTHOR

...view details