తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉదయపు నడక నడిచే వారితో నామ ప్రచారం - ELECTION CAMPAIGN

ఖమ్మంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అజయ్​కుమార్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారితో కలసి ఓటు వేయాలని అభ్యర్థించారు.

ఉదయపు నడక నడిచే వారితో నామ ప్రచారం

By

Published : Apr 1, 2019, 12:13 PM IST

ఉదయపు నడక నడిచే వారితో నామ ప్రచారం
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలో మునిగిపోయాయి. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తెల్లవారు జామునుంచే పరుగులు పెడుతున్నారు.

ఖమ్మం లోక్​సభకు పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలుసుకున్నారు. గ్రౌండ్​లో మార్నింగ్​ వాక్​కు వచ్చిన వారితో కలిసి మాట్లాడారు. నామతో పాటు ఎమ్మెల్యే అజయ్​కుమార్​ ప్రచారంలో పాల్గొన్నారు.

నామ ప్రతి ఒక్కరిని కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే అజయ్​కుమార్​ తనను భారీ మెజార్టీతో గెలిపించారని... అదే విధంగా నామ నాగేశ్వరరావును కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:రంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం... దాడిలో లేగదూడ మృతి

ABOUT THE AUTHOR

...view details