Nagarjuna Sagar Project Water Supply in Khammam: ఖమ్మం జిల్లాలోని 17 మండలాల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు ఉంది. మొత్తం 2 లక్షల 54 వేల 274 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ఇందులో ఏటా ప్రధానంగా వరి పంట సాగవుతుంది. మొత్తం ఆయకట్టులో దాదాపు 80 శాతం ఆయకట్టు వరకు పూర్తిగా సాగర్ జలాలపైనే ఆధారపడి పంటలు సాగవుతాయి. మరో 20 శాతం మేర పంటలు బోర్లు, బావుల జలాలపై ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తారు.
ప్రతి సీజన్‌లోనూ ఎన్ఎస్పీ ఆయకట్టులో పంటల సాగుకు కనీసం 27 నుంచి 31 టీఎంసీల నీటి అవసరం ఉంటుంది. యాసంగిలో ఎండల తీవ్రత నేపథ్యంలో ఇంకా కొంత అదనంగా అవసరమయ్యే అవకాశం ఉంది. జిల్లాలో సాగర్ ఆయకట్టుకు నాగార్జున సాగర్జలాశయం నుంచే నీరు విడుదల చేయాల్సి ఉండగా, 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం, 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 522 అడుగుల మట్టంతోనూ 153.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Paddy Crop Damage in khammam : సాగునీరు లేక పంట పొలాలు వెల వెల.. లబోదిబోమంటున్న కర్షకులు
Nagarjuna Sagar Project Water Supply problems : ఇందులో 110 అడుగుల డెడ్ స్టోరేజీ కాగా 43 అడుగులతో నిల్వ ఉన్న 40 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ వాటా మొత్తం 35 టీఎంసీలు ఉంది. ఈ వాటాలో ఇప్పటికే 10 టీఎంసీల నీటి వాడకం పూర్తయింది. మిగిలింది మరో 25 టీఎంసీలే. సాగర్, శ్రీశైలం ఇతర జలాశయాల కింద తాగునీటి పథకాలకు జూన్ వరకు నీరందించాలంటే దాదాపు 30-40 టీఎంసీల నీరు కావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం 25 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉండటంతో జూన్ వరకు తాగునీటి అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్పీ ఆయకట్టులో సాగుకు చుక్క నీరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.