తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఏఏకు వ్యతిరేకంగా వైరాలో ముస్లింల నిరసన ర్యాలీ - latest news on Muslims protest rally in Vieira against caa in khammam

పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ వైరాలో ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Muslims protest rally in Vieira against caa in khammam
సీఏఏకు వ్యతిరేకంగా వైరాలో ముస్లింల నిరసన ర్యాలీ

By

Published : Feb 29, 2020, 11:16 AM IST

ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా ముస్లింలు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మసీదు సెంటర్‌ నుంచి రింగ్‌రోడ్‌ వరకు జాతీయ జెండాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్​పీఆర్​లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సీఏఏకు వ్యతిరేకంగా వైరాలో ముస్లింల నిరసన ర్యాలీ

ఇవీ చూడండి:నేడే డీసీసీబీ, డీసీఎంఎస్​ ఛైర్మన్​ ఎన్నికలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details