వక్ఫ్ భూములను పేద ముస్లింలకు పంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ముస్లింలు ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్‌లో మోమిన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొన్నారు. గొల్లగూడెంలో ఆక్రమణకు గురవుతున్న వక్ఫ్ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈద్గా, ఖబరిస్తాన్, విద్యాసంస్థలకు భూమి కేటాయించగా.. మిగిలిన భూమిని ఇళ్లు లేని పేద ముస్లింలకు పంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వక్ఫ్ భూములను రక్షించండి.. - muslims
ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఆక్రమణకు గురవుతున్న వక్ఫ్ భూములను ప్రభుత్వం పరిరక్షించాలని ముస్లింలు ఖమ్మంలో ధర్నా నిర్వహించారు. ఈద్గా, ఖబరిస్తాన్‌లకు భూమి కేటాయించిన తర్వాత మిగిలిన భూమిని పేద ముస్లింలకు పంచాలని డిమాండ్ చేశారు.

వక్ఫ్ భూములను రక్షించండి..