ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామంలో బొమ్మకంటి రంగమ్మ అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. రాయపట్నం మాజీ సర్పంచ్ బొమ్మకంటి హరిబాబు తల్లి రంగమ్మ ఇంట్లో ఆరు బయట నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి గుణపంతో పొడిచి హత్య చేసినట్టు తెలుస్తోంది.వృద్ధురాలి మెడలో బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ వాటిని దొంగిలించకుండా... హత్యచేసి వెళ్లడంతో ఆగంతుకుడిని సైకోగా పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామంలోని ఒంటరిగా నివసిస్తున్న మరో మహిళ ఇంటికి వెళ్లి గుణపంతో తాళం పగులగొట్టే ప్రయత్నం చేశాడు.ఆ మహిళ కేకలు వేయడం వల్ల దుండగుడు పారిపోయాడని మహిళ చెబుతోంది. వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, మధిర సీఐ వేణుమాధవ్, పట్టణ ఎస్ఐ చంద్రమోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఖమ్మం నుంచి డాగ్ స్క్వాడ్ బృందాన్ని క్లూస్ టీంలను రప్పించి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఆరుబయట నిద్రిస్తుండగా... ఆర్ధరాత్రి దారుణహత్య - సైకో
ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధురాలిని ఆగంతుకుడు కిరాతకంగా గుణపంతో పొడిచి చంపిన ఘనట ఖమ్మం జిల్లా మధిరలో చోటుచేసుకుంది. ఆ గుర్తుతెలియని వ్యక్తిని సైకోగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నిద్రిస్తున్న వృద్ధురాలి దారుణ హత్య