వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలకు ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచార గడువు మరో రెండ్రోజులు మాత్రమే ఉండటంతో పార్టీల నేతలు విస్తృతంగా పర్యటిస్తూ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. హసన్‌పర్తి మండలం పెగడపల్లిలో తెరాస అభ్యర్థులతో కలిసి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భాజపా చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని... అభివృద్ధికి అడ్డంకిగా మారిన ప్రతిపక్షాలకు బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్... వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగో స్థానానికి పడిపోయిన భాజపా... తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని సత్యవతి హెచ్చరించారు. 59వ డివిజన్‌లో పర్యటించిన కరీంనగర్ మేయర్ సునీల్‌రావు... తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
భాజపా, తెరాస వైఫల్యం చెందాయని..
కాజీపేటలోని కడిపికొండలో భాజపా నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. నగరంలోని పలు డివిజన్లలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పార్టీ నేతలతో కలిసి పర్యటించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థితో కలిసి ఆ పార్టీ నాయకురాలు కొండా సురేఖ ప్రచారం నిర్వహించారు. పరకాలలో కాంగ్రెస్ నేత ఇనగాల వెంకట్రాంరెడ్డి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ నేత వి.హన్మంతరావు ప్రచారం నిర్వహించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో భాజపా, తెరాస వైఫల్యం చెందాయని ఆయన ఆరోపించారు.
జోరుగా ప్రచారం
ఖమ్మం కార్పొరేషన్‌లో పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి... తెరాస అభ్యర్థులకు మద్దతుగా పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి మద్దతునివ్వాలని కోరారు.
ఖమ్మంలో బండి సంజయ్