తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికలు: విజయాన్ని కాంక్షిస్తూ పలు పార్టీల ర్యాలీలు - mlc elections campaigning

మరికొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో అభ్యర్థులు జోరుపెంచారు. ఖమ్మంలో పలు పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

Multi-partys rallies for victory in mlc elections at khammam
ఎమ్మెల్సీ ఎన్నికలు: విజయాన్ని కాంక్షిస్తూ పలు పార్టీల ర్యాలీలు

By

Published : Mar 12, 2021, 1:29 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగుస్తుండటంతో ఖమ్మంలో పలు పార్టీలు భారీ ర్యాలీలు నిర్వహించాయి. తెజస అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్​ కోదండరాం విజయాన్ని కాంక్షిస్తూ తెజస, తెదేపా, సీపీఐ (ఎంఎల్‌) పార్టీల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి ఖమ్మం నగరం మొత్తం ర్యాలీగా తిరిగారు. తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డా.చెరుకు సుధాకర్‌కి ఓటు వేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్‌, ప్రజా, కుల సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ తీశారు.

ఇదీ చూడండి: ప్రపంచ సాంకేతిక రంగంలో భారత యువతదే కీలకపాత్ర : తమిళిసై

ABOUT THE AUTHOR

...view details