ముంబైలోని అంబేడ్కర్ నివాసం రాజగృహపై దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలని ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మానవహారం నిర్మించారు. ఖమ్మం నగరంలోని జడ్పీ కూడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నిందితులకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఘటన జరిగి పది రోజులు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
'రాజగృహపై దాడి చేసిన నిందితులను శిక్షించాలి' - ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా
అంబేడ్కర్ నివాసంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మానవహారం నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు.
!['రాజగృహపై దాడి చేసిన నిందితులను శిక్షించాలి' mrps leaders protest in khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8102479-457-8102479-1595252467974.jpg)
'రాజగృహపై దాడి చేసిన నిందితులను శిక్షించాలి'