కలెక్టరేట్‌ను ముట్టడించిన ఎమ్మార్పీస్ కార్యకర్తలు - khammam Collectorate Latest News
ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ముట్టడించారు. రామోజీ పేటలో ఎస్సీ ఇళ్లపై దాడి చేసిన గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
సిరిసిల్ల కలెక్టరేట్‌ను ముట్టడించిన ఎమ్మార్పీస్ కార్యకర్తలు
రాజన్న సిరిసిల్ల జిల్లా రామోజీ పేటలో ఎస్సీ ఇళ్లపై దాడి చేసిన గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించారు. దాడికి నాయకత్వం వహించిన సర్పంచ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు రక్షణ కల్పించాలని.. పరిహారం చెల్లించాలని అన్నారు.
Last Updated : Nov 7, 2020, 4:43 PM IST