MP Nama Nageswararao comments on Central Health minister: కేంద్ర వైద్యశాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పారని ఎంపీ నామ నాగేశ్వరరావు ఆరోపించారు. తెలంగాణకు బల్క్ డ్రగ్స్ పార్కు ఇవ్వలేదని లిఖితపూర్వకంగా సమధానం చెప్పిన మంత్రి, పార్లమెంటు ప్రశ్నోత్తరాల్లో ఇచ్చేశామని సమధానం చెప్పారని తెలిపారు. తెలంగాణకు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చెప్పడం కేంద్రం వివక్షపూరిత వైఖరికి నిదర్శనమని నామ ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా భాజపా ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి బల్క్ డ్రగ్స్ పార్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
"తెలంగాణకు బల్క్ డ్రగ్స్ పార్కు తీసుకురావాలి" - నామా నాగేశ్వరరావు ప్రెస్‌మీట్
MP Nama Nageswararao comments on Central Health minister: పార్లమెంట్లో కేంద్ర వైద్యశాఖ మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో అబద్ధాలు చెప్పారని ఎంపీ నామ నాగేశ్వరరావు ఆరోపించారు. తెలంగాణకు బల్క్‌డ్రగ్స్ పార్క్ విషయంలో లిఖితపూర్వకంగా ఒక సమాధానం ఇచ్చి పార్లమెంట్లో మరో సమాధానం ఇచ్చారని అన్నారు.
తెలంగాణకు బల్క్ డ్రగ్స్ పార్కు తీసుకురావాలి
"పార్లమెంట్ సాక్షిగా కేంద్ర వైద్య శాఖ మంత్రి అబద్ధం చెప్పారు. ప్రశ్నోత్తర సమయంలో తాను నిలదీసి అడిగినప్పుడు బల్క్‌డ్రగ్స్ పార్కు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి రూ.1000 కోట్లు మంజూరు చేశామని అందులో 300 కోట్లు విడుదల చేశారని మంత్రి చెప్పారు. లిఖితపూర్వకంగా ఇవ్వలేదని ఉంది." -నామ నాగేశ్వరరావు, తెరాస ఎంపీ
ఇవీ చదవండి: