తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ సంకల్పం: ఎంపీ నామ - ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

పేదరికంలో ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్ల రూపాయలు అందిస్తున్నామని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో 62 మంది లబ్ధిదారులకు రూ.38.8 లక్షల చెక్కులను అందజేశారు. సీఎం కేసీఆర్​... నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని నామ తెలిపారు.

'ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్​ కృషి'
'ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్​ కృషి'

By

Published : Jan 3, 2021, 9:10 PM IST

ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్దిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను తెరాస లోక్​సభాపక్షనేత నామా నాగేశ్వరరావు అందజేశారు. మధిర, పాలేరు, వైరా నియోజకవర్గాల్లోని చింతకాని, ఖమ్మం రూరల్​, తిరుమలాయపాలెం, కూసుమంచి, మధిర, కొణిజెర్ల, వైరా, సింగరేణి, బోనకల్​ తదితర మండలాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయంలో రూ. 38.8 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు సీఎంఆర్​ఎఫ్​ ఓ వరం లాంటిదని... దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనారోగ్యంతో బాధపడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని నామా పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటిని ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని నామా తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్​ తుళ్లూరి బ్రహ్మయ్య, తెరాస నాయకురాలు బేబీ స్వర్ణ కుమారి, బొమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు నామాకు జ్ఞాపిక అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: కళ్లు లేకుంటేనేం... కష్టాలను ఓడించి కలెక్టరయ్యాడు!

ABOUT THE AUTHOR

...view details