తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి కార్యక్రమాలే పల్లాను గెలిపిస్తాయి: ఎంపీ నామ - mlc elections warm up meeting in kothagudem

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డిని పట్టభద్రుల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నేతలకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సూచించారు. రైతుబంధు అధ్యక్షుడిగా పల్లా రాణించారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే పల్లా గెలుపుకు దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు కొత్తగూడెం క్లబ్​లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

mp nama nageshwar rao
ఎంపీ నామా నాగేశ్వరరావు

By

Published : Feb 23, 2021, 8:07 PM IST

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం క్లబ్​లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సూచించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో పల్లాను అత్యంత మెజార్టీతో గెలిపించుకుని సీఎం కేసీఆర్​కు కానుకగా ఇద్దామని ఆయన అన్నారు. పల్లా గెలుపు.. అభివృద్ధికి మరింత దోహద పడుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే పల్లాను భారీ మెజార్టీతో గెలిపించి తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తూ కేసీఆర్ ముందుకు పోతున్నారని అన్నారు.

అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయి

పల్లా సాధారణ రైతు కుటుంబంలో పుట్టి స్వయంకృషితో ఎదిగి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని నామ పేర్కొన్నారు. రైతుబంధు అధ్యక్షుడిగా పల్లా రాణించి, ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పును పొందారని కొనియాడారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా నేడు రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటోందని నామ అన్నారు. ఆర్ధిక రంగాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి సమయంలోనూ అన్ని వర్గాల ప్రజలను సీఎం ఆదుకున్నారని వెల్లడించారు.

మార్చిలో జరగనున్న పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం దిల్లీలో జరిగిన పార్లమెంట్ కామర్స్ కమిటీ సమావేశంలో తెరాస లోక్​సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మొదటి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో, రెండో విడత సమావేశాలు మార్చి 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంపీ నామ పార్లమెంట్ లైబ్రరీ కమిటీ ఛైర్మన్​గా ఉండటమే కాకుండా పార్లమెంట్​కు సంబంధించి వివిధ కమిటీల్లో సభ్యునిగా కూడా కొనసాగుతోన్న సంగతి విదితమే.

ఇదీ చదవండి:ఈనెల 28న యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్!

ABOUT THE AUTHOR

...view details