ఖమ్మం జిల్లా జూబ్లీపురలోని ఎంపీ కార్యాలయంలో తెరాస లోక్సభ పక్షనేత నామ నాగేశ్వర రావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. అనారోగ్యం వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని.. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సీఎం సహాయనిధి అందిస్తుందని తెలిపారు.
పేదల పెన్నిధి.. సీఎం సహాయ నిధి: నామ - నామ నాగేశ్వర రావు లేటెస్ట్ వార్తలు
ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెరాస లోక్సభ పక్షనేత నామ నాగేశ్వర రావు అన్నారు. జూబ్లీపురలోని ఎంపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ పరమావధి: నామ నాగేశ్వర రావు
అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, ములకపల్లితోపాటు ముదిగొండ, నేలకొండపల్లి మండలాలకు చెందిన 45 మంది లబ్ధిదారులకు రూ.23.8 లక్షలు విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, బొమ్మెర రాంమూర్తి, ఇతర నాయకులు పాల్గొన్నారు.