తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాక్టర్ ప్రమాద బాధితులకు ఎంపీ క్యాంప్ కార్యాలయ బృందం పరామర్శ - mp nama nageshwara rao

బుధవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గోపవరం గ్రామస్థులను ఎంపీ నామ నాగేశ్వరరావు క్యాంప్​ కార్యాలయ బృందం పరామర్శించింది. బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి ఎంపీ నామ నాగేశ్వరరావు ఫోన్​ ద్వారా తెలుసుకున్నారు.

mp-nama-camp-office-team consolate of-tractor-accident-victims in khammam
ట్రాక్టర్ ప్రమాద బాధితులకు ఎంపీ క్యాంప్ కార్యాలయ బృందం పరామర్శ

By

Published : Jun 18, 2020, 10:14 PM IST

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాక్టర్ ప్రమాద బాధితులను ఎంపీ నామ నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయ బృందం పరామర్శించింది. బుధవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెద్దగోపవరం గ్రామస్థులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ఖమ్మం ఎంపీ, తెరాస లోక్​సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తెరాస రాష్ట్ర నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయ ఇన్​ఛార్జి కనకమేడల సత్యనారాయణ, నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, మందపాటి వెంకటేశ్వరరావు, తదితరులు వెళ్లి పరామర్శించారు.

అనంతరం ఆస్పత్రి ప్రధాన వైద్యులు వెంకటేశ్వర్లు, ఆర్​ఎంవో బి.శ్రీనివాసరావుతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిన్న ప్రమాదం జరిగిన వెంటనే ఘటనపై ఎంపీ నామ ఆరా తీయటంతో పాటు సంబంధిత అధికారులు, వైద్య సిబ్బందితో మాట్లాడిన విషయం విధితమే. ఈ రోజు బాధితులకు అందుతున్నా వైద్య సేవల గురించి ఫోన్ ద్వారా తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, తాళ్లూరి హరీష్ బాబు,రేగళ్ల కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. 12 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details