ఖమ్మం జిల్లా మధిర పురపాలకలో రైల్వేగేటును పూర్తిగా మూసివేయడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటవ పట్టణం నుంచి రెండో పట్టణం వైపుకు వెళ్లాలంటే.. సుందరయ్య నగర్ కూడలి నుంచి కాంగ్రెస్ కార్యాలయం వరకు ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటి వెళ్లాల్సిన పరిస్థితి. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే మధిర పట్టణవాసులు... పట్టణం ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లాలంటే ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.
ప్రధానంగా సమీపంలోని ఆంధ్రప్రదేశ్ సరిసద్దు గ్రామాల నుంచి కూడా వివిధ క్రయవిక్రయాల నిమిత్తం వ్యాపార లావాదేవీల కోసం మధిరకు వచ్చి వెళ్తున్నారు. రైతులు సైతం వ్యవసాయ పురుగు మందులు ఎరువుల కోసం వస్తుంటారు. అయితే పట్టణంలో చిన్నపాటి ఇరుకుగా ఉన్న ఆర్యూబీ వెడల్పు చేస్తే.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్నారు.