తెలంగాణ

telangana

ETV Bharat / state

Monsoon Delayed in Telangana : వరుణదేవా.. మమ్మల్ని కరుణించవయ్యా..!

Delay in Telangana Monsoon : మృగశిర కార్తొచ్చి పదిరోజులవుతున్నా తొలకరి జాడ లేకపోవటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజులుగా తొలకరి కోసం ఎదురు చూస్తున్నా.. వరణుడు మాత్రం కరుణించటం లేదు. రుతుపవనాల రాక ఆలస్యం కాగా.. ప్రస్తుత వాతావరణం ఇంకా మండు వేసవినే తలపిస్తోంది.

Monsoon Delayed In Telangana
Monsoon Delayed In Telangana

By

Published : Jun 19, 2023, 7:12 AM IST

వరుణదేవా.. మమ్మల్ని కరుణించయ్యా..!

Monsoon Rains are delayed Telangana :నైరుతి రుతుపవనాల రాక ఆలస్యంకావడంతో రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు కష్టకాలంఎదురవుతోంది. జూన్‌ మూడో వారం వచ్చినా వర్షాలు లేవు. ఇప్పటికే పోయాల్సిన వరినారు జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అకాల వర్షాలు, వడగళ్ల ఇబ్బంది లేకుండా పంట సీజన్‌ను ముందుకు జరపాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికీ విఘాతం ఏర్పడింది.

Farmers Faces Issues Due Delay in Rain :యాసంగిలో రికార్డుస్థాయిలో 72.63 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వానాకాలంలో సైతం నిరుడు పండిన కోటి 36 లక్షల 3 వేల 798 ఎకరాల కంటే అధికంగా ఈసారి సాగవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈసారి యాసంగి చివరి దశలో అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లగా.. పంటల సీజన్‌ను ముందే ప్రారంభించి మార్చి 31లోగా వరి కోతలు పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఈసారి అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి.

Monsoon in Telangana To Be Delayed : వరి, కంది, వేరుసెనగ, మిర్చి, కంది తదితర పంటలకు సైతం జూన్‌ మొదటి వారంలోనే విత్తనాలు వేసే పద్ధతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గత ఏడాది జూన్‌ 10లోపు వరినారు పోశారు. జులై 12 నుంచి వరినాట్లు ప్రారంభమయ్యాయి. ఈసారి వర్షాభావంతో ఇంతవరకు ఎక్కడా వరినారు పోయలేదు. విత్తనాలు వేయలేదు. బోర్లు, బావులున్న రైతులు సైతం వెనుకాడుతున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు పడినా.. తర్వాత నారు పోస్తే ఆగస్టులోనే నాట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఆగస్టులో భారీ వర్షాలు పడితే నాట్లు ఆరంభ దశలోనే దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. సెప్టెంబరు వరకే వర్షాకాలం ఉన్నందున పంటల సాగుపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆలస్యమయిన కొద్దీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయినా ధైర్యం చేసి విత్తనాలు సమకూర్చుకుంటున్నారు.

Monsoon Delayed In Telangana : ప్రస్తుతం వ్యవసాయానికి అసాధారణ పరిస్థితి నెలకొందని నిపుణులు అంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి అరుదుగా ఉండేదని.. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. వర్షాలు మరీ ఆలస్యమయితే వరి పంటే కాకుండా.. పత్తి, కంది కూడా దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. సీజన్‌ ఆరంభంలో వర్షాలు లేనందున.. దీర్ఘకాలిక రకాలకు బదులు స్వల్పకాలిక వరి రకాలను వేయాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ మేరకు అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details