అడవుల నుంచి బయటకు వచ్చే కోతులకు స్థానికులు నీటి సౌకర్యం కల్పించారు. ఖమ్మం జిల్లాలోని మణుగూరు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై కోతులు సంచరిస్తుంటాయి. వేసవికాలంలో కోతులు తాగునీటికి ఇబ్బంది పడకుండా వాటి ప్రాణాలు నిలిపేందుకు స్థానికులు చిన్నపాటి నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఆ నీటిని తాగి వానరాలు దాహం తీర్చుకుంటున్నాయి. ఇంకొందరు వాటికి ఆహారాన్ని కూడా అందిస్తున్నారు.
కోతుల దాహార్తిని తీరుస్తున్న జంతు ప్రేమికులు - కోతుల దాహార్తిని తీరుస్తున్న జంతు ప్రేమికులు
ఖమ్మం జిల్లాలోని మణుగూరు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై స్థానికులు కోతుల దాహార్తిని తీరుస్తున్నారు. ప్రతి రోజు తొట్టెలలో నీటిని నింపి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
![కోతుల దాహార్తిని తీరుస్తున్న జంతు ప్రేమికులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3087046-thumbnail-3x2-monkeyjpg.jpg)
కోతుల దాహార్తిని తీరుస్తున్న జంతు ప్రేమికులు