తెలంగాణ

telangana

ETV Bharat / state

వామపక్ష మేథావులపై మోదీ సర్కార్ అక్రమ కేసులు: పోతినేని

దేశవ్యాప్తంగా వామపక్ష మేథావులపై మోదీ ప్రభుత్వం కక్ష కట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో వామపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించి మోదీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.

By

Published : Sep 15, 2020, 3:54 PM IST

Breaking News

మోదీ ప్రభుత్వం ఫాసీస్టు చర్యలతో దేశంలోని వామ పక్ష మేథావులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ మండిపడ్డారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో వామ పక్ష పార్టీలతో సమావేశం నిర్వహించారు.

ప్రజాస్వామిక వాదులపై కేంద్రం జులుం..

తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ప్రోఫెసర్‌ జయతి గోష్‌, యోగేంద్ర యాదవ్ వంటి ప్రజాస్వామిక వాదులపై కేంద్ర ప్రభుత్వం జులుం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో సీఐఏ అల్లర్లకు సీపీఎం నేతలే కారణమంటూ కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. ఇటువంటి కేసులతో దేశంలో ప్రశ్నించే గొంతును అణగదొక్కలేరని హితవు పలికారు. ఈ కేసులతో మోదీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు.

ఇవీ చూడండి : భారీగా గుట్కా పట్టివేత.. ఒకరు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details