ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనకు అనూహ్య స్పందన వస్తోందని ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఖమ్మంలో పాదయాత్ర చేపట్టి ఆయన ప్రచారం నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ప్రచారం చేస్తూ... పట్టభద్రులను అభ్యర్థించారు.
ప్రశ్నించే గొంతుకగా ఉంటా: తీన్మార్ మల్లన్న - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రచారం చేశారు. తనకు ఓటు వేస్తే పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రశ్నించే గొంతుకగా ఉంటానని అన్నారు.

ప్రశ్నించే గొంతుకగా ఉంటా: తీన్మార్ మల్లన్న
ఖమ్మంలో కోర్టు సముదాయాలు తిరుగుతూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేస్తానని... ప్రశ్నించే గొంతుకగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:వచ్చే ఎన్నికల పరిస్థితి ఏంటో!
Last Updated : Dec 5, 2020, 2:21 PM IST