ఖమ్మం జిల్లా తల్లాడలో పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి రాష్ట్ర రైతు బంధు కన్వీనర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మోటార్ బైక్ ప్రదర్శనతో రోడ్ షో నిర్వహించారు. కల్లూరు బహిరంగసభ వరకు తెరాస శ్రేణులతో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పల్లా... పాల్గొన్న మంత్రి, ఎంపీ - mlc election campaign
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి... పార్టీ నేతలతో కలిసి తల్లాడ నుంచి కల్లూరు వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ర్యాలీలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పల్లా... పాల్గొన్న మంత్రి, ఎంపీ
ఈ ప్రచారంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. నేతలకు సత్తుపల్లి నియోజకవర్గ తెరాస కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రైతు నేత, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పల్లా రాజేశ్వర్ రెడ్డినే గెలిపించి మరోసారి ఎమ్మెల్సీకి పంపాలని నేతలు కోరారు.