తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఖమ్మం అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఏమైనా ఉందా?'

ఖమ్మం నగరం అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమైనా ఉందా అని భాజపాను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పాత బస్టాండ్​పై నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గొల్లపాడు భూనిర్వాసితులను తామే ఆదుకుంటామని స్పష్టం చేశారు.

By

Published : Jan 31, 2021, 7:58 PM IST

MLC Balasani Lakshminarayana Challenges BJP
భాజపాకు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సవాల్

ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమైనా ఉందా? అని భాజపాను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. నాయకులు చెప్పాలని సవాల్ విసిరారు. జిల్లా తెరాస కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

పాత బస్టాండ్​పై ప్రతిపక్ష నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గోళ్లపాడు ఛానల్ నిర్వాసితులకు భూమి ఇచ్చినట్లు, వసతులు కల్పించినట్లు బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

గోళ్లపాడు ఛానల్ అభివృద్ధిలో భాగంగా తెరాస ప్రభుత్వం.. భూ నిర్వాసితులకు రెండేళ్ల క్రితమే వెలుగుమట్లలో ఇళ్ల స్థలాలిచ్చిందన్నారు. వారిని అన్ని విధాలుగా తామే ఆదుకుంటామని తెలిపారు. భాజపా నేతలకు దమ్ముంటే వాళ్లకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి

ABOUT THE AUTHOR

...view details