తెలంగాణ

telangana

ETV Bharat / state

'తొత్తులుగా ఉండి అన్యాయం చేసింది మీరే' - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

వైఎస్​ రాజశేఖర్ రెడ్డికి తొత్తులుగా ఉండి దక్షిణ తెలంగాణకి అన్యాయం చేసింది ఉత్తమ్, భట్టి విక్రమార్కలేనని తెరాస ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆరోపించారు. టెయిల్​పాండ్ పేరుతో రూ. 800 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించారు.

mlc balasani laxminarayana comments congress party yourself a disservice in ys rajashekar reddy
'తొత్తులుగా ఉండి అన్యాయం చేసింది మీరే'

By

Published : May 14, 2020, 4:22 PM IST

ఖమ్మం జిల్లా తెరాస పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు. ఆరోజు జగన్​తో కలిసి నాగార్జునసాగర్ టెయిల్​పాండ్ పేరుతో రూ. 800 కోట్లు స్వాహా చేశారని ఆయన అన్నారు. ఈరోజు పోతిరెడ్డిపాడుపై ప్రచార ఆర్భాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణకు అన్యాయం జరిగేవిధంగా ఆంధ్రా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు.

'తొత్తులుగా ఉండి అన్యాయం చేసింది మీరే'

ఇదీ చూడండి :'ఆనాడు మీరు ఎందుకు అడ్డుకోలేదు'

ABOUT THE AUTHOR

...view details