MLAs Dance In Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమ నియోజకవర్గాల్లో రాజకీయ పర్యటనలు చేస్తున్న ఎమ్మెల్యేలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ అవకాశం ఉన్నప్పుడు పాటల జోరుకు తగ్గట్టు చిందేస్తూ అందరినీ అలరింప చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ విప్ భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆళ్లపల్లి మండలంలోని కార్యక్రమంలో పాల్గొని డాన్స్‌తో అలరింప చేశారు.
పర్యటనల్లో పాల్గొంటూ.. డాన్సులతో అలరిస్తున్న ఎమ్మెల్యేలు - ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్యేల డాన్స్‌లు
MLAs Dance In Khammam: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు డాన్స్‌లతో దుమ్మురేపుతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఇలా అప్పుడప్పుడు ఆటపాటలతో నియోజకవర్గాల ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే.. ఇలా డాన్సులతో ఊర్రూతలూగిస్తున్నారు.
ఎమ్మెల్యేల డాన్స్
తాజాగా ఆదివారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధి కారేపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. మండలంలో తిరుపతమ్మ అమ్మవారి కల్యాణ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్ డాన్స్‌తో అదరగొట్టారు. వీరిద్దరూ బీఆర్ఎస్ అధికార పార్టీ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైపు పార్టీ శ్రేణులు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తూ.. అవకాశం వచ్చినపుడు విమర్శలు చేస్తూ డాన్సులతో సందడి చేస్తున్నారు.
ఇవీ చదవండి: