లాక్డౌన్ వేళ దాతృత్వం చాటిన ఎమ్మెల్యే - నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి
ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పర్యటించారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండా ఎగురవేశారు.
కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కొని.. భౌతిక దూరం పాటించాలని పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే.. బైక్పై ఇంటింటికి తిరుగుతూ నిత్యావసర సరుకులు, కూరగాయాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ వ్యవసాయ పనులు చేసుకోవచ్చని రైతులకు సూచించారు. పండిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందొద్దన్నారు. అంతకుముందు ఖమ్మం గ్రామీణ మండలం తల్లంపాడులో తెరాస ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ