మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఖమ్మం జిల్లా పెనుబల్లిలోని నీలాద్రీశ్వర ఆలయానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుటుంబసమేతంగా విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.
కొవిడ్ నిబంధనల దృష్ట్యా కోనేరులో స్నానాలను నిషేధించినప్పటికీ.. భక్తులు లెక్కచేయకుండా పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఇప్పటివరకూ.. సుమారు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.