తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ రంగానికి మేలు చేయడమే తమ లక్ష్యం: సండ్ర - సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటన

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటించారు. ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న కాలువల్లో పూడికతీత పనులు పరిశీలించారు. రైతులకు మేలు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

mla sandra venkataveeraih tour in sthupally mandal
వ్యవసాయరంగానికి మేలు చేయడమే తమ లక్ష్యం: సండ్ర

By

Published : Jun 9, 2020, 4:06 PM IST

వ్యవసయరంగానికి, రైతులకు మేలు చేయడమే తమ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామానగరం, తాళ్లమడ, బేతుపల్లి, కిష్టాపురంలో ఉపాధి కూలీలు చేపట్టిన కాలువల్లో పూడికతీత పనులు పరిశీలించారు. ఐదేళ్లుగా కాలువల నిర్వహణకు నిధులు లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు, చెత్త, మట్టితో పూడుకుపోయాయన్నారు.

ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరుపుతుందన్నారు. బేతుపల్లి చెరువు కట్ట కింద ఆరు వేల ఎకరాలకు నీరందించే 23 కిలోమీటర్ల మేర ఉన్న కాలువల్లో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ సభ్యుడు రామారావు, ఎంపీడీవో సుభాషిని, సర్పంచులు పి. శ్రీనివాసరావు, కళావతి, మందలపు నాగమణి, నీలిమ, ఆత్మ ఛైర్మన్ కృష్ణారెడ్డి, బాబురావు, వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఒకే ఇంట్లో 26 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details