రైతులు వానాకాలం సీజన్లో ప్రభుత్వం సూచించిన అనుకూలమైన పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కేజీ మల్లేలలో బుధవారం వానాకాలం పంటలపై అవగాహన సదస్సుకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వరిలో 40 శాతం వరకు సన్నరకం, 60 శాతం లావు రకం వడ్లను పండించాలని రైతులను కోరారు. షుగర్ ఫ్రీ తెలంగాణ సోనా రకం వరి పండించాలని ఆయన తెలిపారు. పాఠశాలలో, వసతి గృహాల్లో ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్నారని ఇకపై రేషన్ దుకాణాల్లో కూడా సన్న బియ్యం ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.
'వానాకాలం సీజన్లో ప్రభుత్వం సూచించిన పంటలు సాగుచేయాలి'
ఖమ్మం జిల్లా కేజీ మల్లేలలో వానాకాలం పంటలపై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. అన్నదాతలు వానాకాలంలో ప్రభుత్వం సూచించిన పంటలు సాగుచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
మామిడి తోటల సాగులో ప్రకృతి అనుకూలించక రైతులు నష్టపోతున్నారని, జిల్లాలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు సర్కారు సన్నాహాలు చేస్తోందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా కరవు మండలమైన వేంసూరుకు నీళ్లు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కేజీ మల్లెల సొసైటీ పరిధిలో రైతులకు పచ్చి రొట్ట విత్తనాల పంపిణీని ఎమ్మెల్యే సండ్ర ప్రారంభించారు. అనంతరం ఫొటోగ్రాఫర్లకు, లాండ్రీ వర్కర్లకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ హరికృష్ణ రెడ్డి ,డీసీసీబీ డైరెక్టర్ సంజీవ రెడ్డి, ఎంపీపీ వెంకటేశ్వరరావు ,జడ్పీటీసీ సభ్యురాలు సుమలత, సొసైటీ ఛైర్మన్ జమల రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రతి కుటుంబానికి రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం నిలిపివేత