తెలంగాణ

telangana

ETV Bharat / state

సూపర్​ స్ప్రెడర్స్​ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే - MLA Sandra Venkata veeraiah

కొవిడ్​ మహమ్మారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సూపర్​ స్ప్రెడర్లకు జరుగుతోన్న​ వ్యాక్సిన్​ పంపిణీ తీరును ఆయన పరిశీలించారు.

super spreaders vaccination center
super spreaders vaccination center

By

Published : Jun 6, 2021, 7:59 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సూపర్​ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందర్శించారు. కూరగాయల దుకాణాల యాజమాన్యానికి, మెడికల్ షాపులు, ఆర్టీసీ సిబ్బందికి ఇప్పటికే టీకాలు అందించినట్లు ఆయన తెలిపారు. త్వరలో లారీ, ఆటో డ్రైవర్లకు కూడా వ్యాక్సిన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కొవిడ్​ మహమ్మారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మహేశ్, ఎంపీపీ హైమావతి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ABOUT THE AUTHOR

...view details