తెలంగాణ

telangana

ఏడాదిలోనే సత్తుపల్లి అభివృద్ధికి రూ.70 కోట్లు: ఎమ్మెల్యే సండ్ర

By

Published : Apr 4, 2021, 10:14 AM IST

సత్తుపల్లి పట్టణ సుందరీకరణకు అన్ని చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ మరో రూ.30కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఏడాదిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం దాదాపు రూ.70కోట్ల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు.

mla sandra venkata veeraiah press meet, sathupally mla sandra
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి నియోజకవర్గం కోసం నిధులపై ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి మరో రూ.30 కోట్లు మంజూరు చేసినందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఏడాదిలో ప్రభుత్వం దాదాపు రూ.70 కోట్ల నిధులు నియోజకవర్గానికి కేటాయించిందని వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

నిధులు మంజూరు

పట్టణ ఆధునికీకరణలో భాగంగా తామర చెరువు సుందరంగా తీర్చి దిద్దడానికి ఇప్పటికే నిధులు మంజూరు అయ్యాయని.. పట్టణ శివారులోని చెరువును అభివృద్ధి చేస్తామని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 34 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెనుబల్లి మండలం బయ్యన గూడెం గ్రామం నుంచి అగ్రహారం బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.నాలుగున్నర కోట్లు... రేచర్ల నుంచి చాలమ్మ గ్రామం వరకు వయా సిద్ధాంతం నారాయణపురం పది కిలోమీటర్ల రహదారికి రూ.6 కోట్లు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

వివిధ సామాజిక వర్గాల కోసం అవసరమైన నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. ఈ సమావేశంలో హరికృష్ణ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మహేశ్, వైస్​ఛైర్​పర్సన్ సుజల రాణి, డీసీసీబీ డైరెక్టర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కృత్రిమ మేధతో వ్యాధుల గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details