తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సండ్ర - సత్తుపల్లి ఎమ్మెల్యే

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల సత్తుపల్లి నియోజకవర్గంలో 465 కిలోమీటర్ల మేర పంట కాలువలో పూడిక తీసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందామని శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో రైతు వేదిక నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.

MLA Sandra Venkata Veeraiah Inaugurates Raithu vedika Building works
రైతు వేదిక నిర్మాణానికి.. శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సండ్ర

By

Published : Jul 19, 2020, 9:10 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కరోనా సమయంలో రైతులకు పంట పెట్టుబడులు, రైతుబంధు పథకం డబ్బులు ఇచ్చి రైతు పక్షన తమది నిలబడే ప్రభుత్వం అని కేసీఆర్​ రుజువు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ధాన్యం సేకరణలో కేసీఆర్​ తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచాన్నారు. రైతేరాజుగా తాను పండించిన పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించుకోవడం, ఏయే పంటలు పండించాలో.. ఆలోచించుకునేందుకు రైతు వేదికల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.

రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలనే ముఖ్యమంత్రి నిర్ణయంతో ఇంటర్, డిగ్రీ స్థాయిలో డ్రాపవుట్​లు తగ్గుతాయని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూర్ మండలాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు 31.50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమోతు వెంకటేశ్వరరావు, ఆత్మ చైర్మన్ హరికృష్ణ రెడ్డి ,ఎంపీపీ దొడ్డ హైమావతి, జడ్పీటీసీ సభ్యుడు రామారావు ,వ్యవసాయ శాఖ జిల్లా నియోజకవర్గ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల

ABOUT THE AUTHOR

...view details