కరోనా కష్ట కాలంలో పాస్టర్లను ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన బేతేలు కాస్పోయిల్ సొసైటీని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో 50 మంది పాస్టర్లకు బియ్యం నిత్యావసర సరుకులతో పాటు రెండు సైకిళ్లను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. అందరూ లాక్డౌన్ నిబంధనలను పాటించాలని కోరారు.
పాస్టర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సండ్ర - తెలంగాణ వార్తలు
సత్తుపల్లి మండలంలోని పాస్టర్లకు నిత్యావసరాలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పంపిణీ చేశారు. బేతేలు కాస్పోయిల్ సొసైటీని అభినందించారు. మూడో దశను ఎదుర్కొనేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
![పాస్టర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సండ్ర groceries distribution, mla sandra venkata veeraiah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:20:40:1623559840-12111899-df.jpg)
పాస్టర్లకు నిత్యావసరాలు పంపిణీ, ఎమ్మెల్యే వెంకట వీరయ్య
సత్తుపల్లి నియోజకవర్గంలో కరోనా మూడో దశను ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజారోగ్యం దృష్ట్యా సత్తుపల్లిలో నూతన ప్రభుత్వ ఆస్పత్రిని మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:Crime: చికెన్ ఉద్దెర ఇవ్వలేదనే కత్తితో దాడి