MLA Sandra Venkata Veeraiah allegations against some politicians: ముసుగు వేసుకొని కొందరు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన ఆరోపణలు చేశారు. ముసుగు తొలగించి రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. తాను ఎప్పుడూ దొంగ రాజకీయాలు చేయలేదని, కొంతమంది తప్పుడు పద్ధతిలో షార్ట్‌కట్ మెదడుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని కొందరు చిల్లర రాజకీయాలు దుయ్యబట్టారు. ఏ నాయకుడిని ఉద్దేశించి సండ్ర వెంకట వీరయ్య ఈ వ్యాఖ్యలు చేశారనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాజకీయాలపై ఎమ్మెల్యే సండ్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్
MLA Sandra Venkata Veeraiah allegations against some politicians:ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య క్యాంపు కార్యాలయంలో 100 మంది లబ్ధిదారులకు 66 లక్షలు ముఖ్యమంత్రి సహాయ చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా కొందరు రాజకీయ నాయకులు తప్పుడు పద్ధతిని ఎంచుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కొందరి రాజకీయనాయకులపై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపణలు
"చిల్లర రాజకీయలతో కొందరు నాయకులు ఏదో చెయ్యాలని అనుకొంటున్నారు. ప్రజలు మీరు అది గుర్తించాలి. ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఓసీ నాయకులు రాజ్యాంగ బద్ధంగా పోటీ చెయ్యడానికి వీలులేదు. కాని తప్పుడు పద్ధతిలో వెళ్తున్నారు. పార్టీలో ఉండి తప్పు చేస్తే నన్ను విమర్శించాలి. నేను ఏ తప్పు చేయలేదు. ఏ పార్టీలో ఉన్ననో ఆ పార్టీ నిబద్దతతో ఎమ్మల్సీ ఓటు వేశాను."-సండ్ర వెంకట వీరయ్య, భారాస ఎమ్మెల్యే
ఇవీ చదవండి: