ఖమ్మం జిల్లా సత్తుపల్లి కూరగాయల మార్కెట్లో పర్సనల్ శానిటైజేషన్ ఎన్‌క్లోజర్ ఛాంబర్లను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్క్ ధరించాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం నిల్వలను ప్రభుత్వ పాఠశాల్లో నిల్వ చేసుకునే విధంగా కలెక్టర్ జీవో జారీ చేశారని వివరించారు. ఐకేపీ ఆధ్వర్యంలో మామిడి కొనుగోలు చేయడం జరుగుతుందని, ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకు ఐకేపీ టన్నుకు రూ. 20 వేలు చెల్లిస్తుందని అన్నారు.
మార్కెట్ శానిటైజేషన్ ఎన్‌క్లోజర్ ప్రారంభం - సత్తుపల్లి మార్కెట్లో ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి కూరగాయల మార్కెట్లో పర్సనల్ శానిటైజేషన్ ఎన్‌క్లోజర్ ఛాంబర్లను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కరోనా వేళ భౌతిక దూరం పాటిస్తూ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పెనుబల్లి మండల పరిషత్ కార్యాలయంలో మామిడికాయ యార్డు యజమానులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. మామిడి ఎగుమతికి కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారని, వారికి అనుమతులు ఇప్పించాలని యజమానులు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పురపాలక ఛైర్మన్ మహేష్, కమిషనర్ సుజాత, ఎంపీడీవో మహాలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు మోహన్ రావు, తెరాస మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కనగాల వెంకట్రావు, భూక్య ప్రసాద్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి :రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ బ్రెయిన్‌డెడ్